Home > Featured > మట్టి, బొద్దింకల వేలం పాట ఆపేయించిన నాసా

మట్టి, బొద్దింకల వేలం పాట ఆపేయించిన నాసా

NASA stops auction song for mud and cockroaches

నాసా ఏంటీ? మట్టి బొద్దింకల వేలం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నా. కాకపోతే ఆ మట్టి మన భూమ్మీద దొరికేది కాదు. చంద్రుడి నుంచి తెచ్చింది. వివరాల్లోకెళితే.. 1969లో నాసా అపోలో వ్యోమనౌకలో చంద్రుడిపై మనుషుల్ని పంపింది. వారు తిరిగి వచ్చేటప్పుడు కొంత మట్టిని పరిశోధన నిమిత్తం తీసుకొచ్చారు. తర్వాత నాసా వారికి ఓ అనుమానం పట్టుకుంది. ఆ మట్టిలో గ్రహాంతర సూక్ష్మక్రిములు ఉండి ఉంటే, అవి మొత్తం వ్యాపించి మానవాళికి ఏమైనా ముప్పు వాటిల్లుతుందేమోనని సందేహపడ్డారు. దాంతో నాసాలో పనిచేసే మరియన్ అనే శాస్త్రవేత్త కొంత మట్టిని తన ఇంటివద్ద ఉన్న ప్రయోగశాలకు తీసుకెళ్లి, వాటిని బొద్దింకలు తినేలా చేశాడు. వాటిని తిన్న బొద్దింకలపై అనేక పరిశోధనలు చేసి మట్టిలో ఎలాంటి సూక్ష్మక్రిములు లేవని నిర్ధారించారు.

అయితే ఆ మట్టిని, చనిపోయిన బొద్దింకలను తిరిగి నాసాకు అప్పగించలేదు. ఎవరో ఔత్సాహికులు 2010లో మరియన్ కూతురుకి కొంత డబ్బిచ్చి ఆ మట్టిని, బొద్దింకలను కొనుగోలు చేశారు. వారు ఇప్పుడు వాటిని బోస్టన్‌లో 4 లక్షల డాలర్ల వేలానికి పెట్టగా, నాసా అడ్డుకుంది. ఆ మట్టి చంద్రుడి నుంచి తెచ్చింది కాబట్టి, అమెరికా ప్రభుత్వానికే చెందుతాయని నాసా అల్టిమేటం ఇవ్వడంతో వేలం ఆగిపోయింది. మట్టి బరువు కేవలం 40 మిల్లీ గ్రాములే అయినా, అవి బయటి వ్యక్తుల చేతుల్లో ఉండడం కరెక్టు కాదని నాసా అభిప్రాయం.

Updated : 24 Jun 2022 5:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top