NASA sun video captures piece of sun breaking off, baffles scientists
mictv telugu

సూర్యుడు చీలిపోయాడు.. గగుర్పొడిచే వీడియో..

February 10, 2023

NASA sun video captures piece of sun breaking off, baffles scientists

మనకే కాకుండా సమస్త ప్రకృతికి ఉష్ణం ఇస్తూ ప్రాణాలు కాపాడుతున్న సూర్యుడికి ఏమో అయింది! మెల్లగా విచ్చిపోతున్నాడు. భాస్కరుడి ఉత్తర ధ్రువం నుంచి ఓ పెద్ద ముక్క ఊడిపోయింది. ఆ ప్రాంతంలో టోర్నడోలా సుడిగాలులు రేగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కలకలం రేపుతోంది. ప్లాస్మా(విద్యుత్ వాయివు) సూర్యుడి నుంచి వీడిపోయి ఉత్తర ధ్రువంపై చక్కర్లు కొడుతోంది. మన సూర్యుడికి ఏమైందని శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.

 

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ అద్భుత దృశ్యాన్ని రికార్డు చేసింది. సూర్యనుంచి వెలువడే జ్వాలలు కొన్ని సార్లు భూమిపై కమ్యూనికేషన్లకు అవాంతరం కలిగిస్తాయి. తాజాగా ఉత్తర ధ్రువంలో ఓ ముక్క పుటుక్కున ఊడిపోవడంతో ఎప్పుడు ఏమవుతుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్ అవుతుంటుందని, కానీ తాజా ‘పేలుడు’ వంటి పరిమాణామాన్ని ఇదివరకు గమనించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.