Nasal vaccine cost is Rs. 800 : Bharat Biotech
mictv telugu

నాజల్ టీకా ధర రూ. 800.. వారికి మాత్రం రూ. 320కే : భారత్ బయోటెక్

December 27, 2022

Nasal vaccine cost is Rs. 800 : Bharat Biotech

భారత్ బయోటెక్ సంస్థ డెవలప్ చేసిన నాజల్ టీకా (ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్) ధరను వెల్లడించింది. త్వరలోనే ప్రైవేటులో అందుబాటులోకి వచ్చే ఈ టీకా ధరను రూ. 800 గా నిర్ణయించినట్టు తెలిపింది. దీనికి అదనంగా 5 శాతం జీఎస్టీ, టీకా వేసినందుకు చార్జీ వసూలు చేస్తారు. ఇక భారీ స్థాయిలో సేకరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ. 320కే ఇస్తామని పేర్కొంది. ‘బీబీవీ154’ గా పిలిచే ఈ టీకా ‘ఇంకొవాక్’ బ్రాండుతో రానుంది. ఈ టీకాను బూస్టర్ డోస్ గా చెప్తున్నారు. ఈ టీకా ‘కొవిన్’ యాప్ ద్వారా లభ్యమయి జనవరి నాలుగో వారంలో మార్కెట్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇంతకుముందు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు దీన్ని తీసుకోవచ్చని, కరోనాపై సమర్ధవంతంగా పోరాడుతుందని వివరించింది. ఇక ఈ వ్యాక్సిన్ ని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే అంశంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.