చంద్రుడిపై నీరు ఉంది.. నాసా ప్రకటన(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రుడిపై నీరు ఉంది.. నాసా ప్రకటన(వీడియో)

October 27, 2020

Surface

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) సంచలన ప్రకటన చేసింది. చందమామపై నీటి జాడలు కనుగొన్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు సూర్యుడి కాంతి పడని ప్రాంతాల్లో నీరు ఉన్నట్టు తేల్చిన సంగతి తెల్సిందే. తాజాగా చంద్రుడిపై సూర్యుడి కాంతి పడే ప్రదేశంలోనూ నీరు ఉన్నట్టు గుర్తించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లైయింగ్‌ అబ్జర్వేటర్‌ అయిన సోఫియా ద్వారా నాసా ఈ విషయాన్ని గుర్తించింది. 

చంద్రుడి దక్షిణ ధృవంపై ఉండే క్లావియస్ లోయలో నీరు ఉందని నాసా గుర్తించింది. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ నీరు ఓ చిన్న ఉల్కాపాతం వల్ల చంద్రుడిపై పడి ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తు పరిశోధనల కోసం వైపర్‌ అనే నీటిని పరిశోధించే రోవర్‌ను చంద్రుడిపై పంపాలని నాసా భావిస్తోంది. 2022 నాటికి అంది చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రుని నీరు లభ్యం అయితే అక్కడ కాలనీలు కట్టాలని నాసా భావిస్తోంది.