కరోనా తుడుచుడు పిచ్చోడి అరెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా తుడుచుడు పిచ్చోడి అరెస్ట్ 

April 4, 2020

కరోనా కాలంలో కొందరు మూర్ఖులు కరోనాకు సపోర్ట్ చేస్తున్నారు. దానిని ఇతరులకు వ్యాపింపజేయాలని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. క్వారంటైన్‌లో ఉండమన్నందుకు పోలీసులను, వైద్యులను దుర్భాషలు ఆడిన విషయం తెలిసిందే. కొందరైతే పోలీసుల మీద, ఆసుపత్రులలో ఉమ్మేస్తూ దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సయ్యద్ జమాల్ బాబు (38) అనే వ్యక్తిని మాలేగావ్‌లో గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. కరెన్సీ నోట్లతో ముక్కు, నోరు తుడుచుకున్న వీడియోను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసులకు చేరింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. ‘జమాల్ వీడియో వైరల్ అయి.. అది మాదాకా వచ్చింది. దీంతో అతడిని అరెస్ట్ చేశాం. మాలేగావ్ కోర్టు ఆదేశాల మేరకు అతడిని ఏప్రిల్ 7 వరకు కస్టడీలోనే ఉంచుతాం. ఇలాంటి పిచ్చి పనులకు ఎవరు పూనుకున్నా సహించేది లేదు’ అని హెచ్చరించారు. కాగా, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 423కు చేరుకోగా, 19 మంది మృతిచెందారు.