నాథురాం గాడ్సే దేశభక్తుడు.. - MicTv.in - Telugu News
mictv telugu

నాథురాం గాడ్సే దేశభక్తుడు..

May 16, 2019

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ..‘స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందూనే’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రచార ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, కమల్ వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడుతున్నారు. ర్యాలీలో కమల్ ప్రసంగిస్తూ..‘ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది హిందూ.. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే. అప్పటి నుంచే ఈ ఉగ్రవాదం ప్రారంభమైంది’ అని కమల్‌ చెప్పుకొచ్చారు. ఒక గాంధేయవాదిగా నాకు గాంధీ హత్యకు గల కారణాలను తెలుసుకోవాలని ఉందనడం కొసమెరుపు.

కాగా, కమల్ హాసన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. మ‌హాత్మాగాంధీని హ‌త్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశ భ‌క్తుడు అని అన్నారు.  భోపాల్ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న ప్ర‌జ్ఞ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. గాడ్సే దేశ‌భ‌క్తుడని, అత‌ను దేశ భ‌క్తుడిగానే ఉంటార‌ని, అత‌న్ని ఉగ్ర‌వాదిగా పిలుస్తున్న‌వారు త‌మ‌ను తాము ఆత్మవిమర్శ చేసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో అలాంటి వారికి ప్రజలు గుణపాఠం నేర్పుతారని చెప్పారు.