జాతీయగీతాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు! - MicTv.in - Telugu News
mictv telugu

జాతీయగీతాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు!

October 31, 2017

సినిమా హాళ్లలో జనగణమన రికార్డుపై ఎంత గొడవ రేగుతోందో మనకు తెలిసిందే. ఇప్పడు చైనాలో కూడా ఇలాంటి రగడే సాగుతోంది. కొందరు ఆ దేశ జాతీయ గీతమైన  ‘మార్చ్ ఆఫ్ వలంటీర్స్’ను అవమానిస్తున్నారని కామ్రేడ్ల సర్కారు గుస్సా అవుతోంది.

దీనికి చెక్ పెట్టేందుకు అలాంటి నేరానికి పాల్పడే వారికి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని యోచిస్తోంది. ఈమేరకు రబ్బరు స్టాంపు అయిన పార్లమెంటు కసరత్తు చేస్తున్నట్లు జినువా వార్తా సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు పార్లమెంటరీ కమిటీ పరిశీస్తోంది. మార్చ్ ఆఫ్ వలంటీర్స్ ను ఎవరైనా కించపరిస్తే 15 రోజుల పోలీసు కస్టడీ విధించాలని సెప్టెంబరులో చైనా ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది.  చైనాలో రాజకీయ సమావేశాలు, నాయకుల ప్రమాణా స్వీకారాలు, పెద్ద పండగలు తదితర సందర్భాల్లో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. అంత్యక్రియలు, ప్రైవేటు కార్యక్రమాల్లో దీన్ని పాడడం నిషేధం.