National anthem 'Jana Gana Mana' resounds throughout Telangana.
mictv telugu

‘జనగణమన’తో మారుమోగిన తెలంగాణ.. అబిడ్స్ వద్ద సీఎం కేసీఆర్ గీతాలాపన

August 16, 2022

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ‌ వ్యాప్తంగా జాతీయ గీతం ‘జనగణమన’తో మారుమోగింది. మంగళవారం ఉదయం సరిగ్గా 11.30గంటలకు నిమిషం పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల వద్ద సామూహికంగా జాతీయగీతాన్ని ఆలపించారు. మెట్రో రైళ్లు సహా ఇతర వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అబిడ్స్ జీపీవో స‌ర్కిల్ వ‌ద్ద జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు కేశ‌వ‌రావు, అస‌దుద్దీన్ ఓవైసీ, మంత్రులు మ‌హ‌ముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని విజ‌య‌వంతం చేశారు. తెలంగాణ రాష్ట్ర‌మంతా స‌రిగ్గా 11:30నిమిషాల‌కు జాతీయ గీతాలాప‌న కొన‌సాగింది.ఖైర‌తాబాద్ జంక్ష‌న్ లో సామూహిక జ‌న‌గ‌ణ‌మ‌నని పాడారు.