సినిమా థియేటర్లలో జనగణమన రికార్డు వేసేటప్పుడు లేచి నిలబడ్డం తప్పనిసరేమీ కాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జాతీయగీతాన్ని అలా గౌరవిస్తే తప్పేంటని ప్రశ్నిస్తుండగా, వినోదం కోసం వెళ్లే థియేటర్లలో దేశభక్తికి శీల పరీక్ష ఏంటేని మరికొందరు మండిపడుతున్నారు. బాలీవుడ్ గాయకుడు సోనూ నిగం కూడా దీనిపై స్పందించాడు.
‘జాతీయ జెండాను గౌరవిస్తే తప్పేంటి? నేనైతే పాకిస్తాన్ జాతీయ గీతమైనా సరే లేచి నిలబడతాను. జాతీయగీతం విలువైంది. మనం దానిని గౌరవించాలి’ అని అన్నాడు. కాని సినిమా, రెస్టారెంట్లు లాంటి ప్రదేశాల్లో గౌరవం దొరకదని. గౌరవం దొరకని చోట దేశజాతీయగీతాన్ని వినిపించడం మంచిది కాని కూడా అన్నాడు. ‘నా తల్లిదండ్రులంటే నాకు ఎంతో గౌరవం. వారికి కొన్నిప్రదేశాల్లో గౌరవం దక్కదు అని తెలిసినప్పుడు వారిని ఆ ప్రదేశాలకు ఎందుకు తీసుకెళతాను? అయితే అది ఎలాంటి ప్రదేశమైనా సరే జాతీయ గీతం వినపడితే లేచి నిలబడతాను’ అని పేర్కొన్నాడు.