తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించకపోవడంతో మొదలైన ఈ గొడవ.. గవర్నర్ ప్రతీ పర్యటనపై పడింది. సమ్మక్క సారక్క, భద్రాచలం ఇలా ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం అటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కూడా ప్రతివిమర్శలకు దారి తీసింది. ఈ క్రమంలో గవర్నర్‌పై పాడి కౌశిక్ తీవ్ర పదజాలంతో విమర్శించారు. అసెంబ్లీ తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన వద్ద పెట్టుకొని ఒక్క ఫైల్ కూడా కదలనివ్వడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.