జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్.. డీజీపీకి కేంద్ర మహిళా కమిషన్ నోటీస్ - MicTv.in - Telugu News
mictv telugu

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్.. డీజీపీకి కేంద్ర మహిళా కమిషన్ నోటీస్

June 7, 2022

హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ గ్యాంగ్‌రేప్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఈ కేసుపై విచారణకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్.. తెలంగాణ పోలీసు శాఖకు నోటీసులు జారీచేసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే ఈ వీడియోలను ఆన్‌లైన్ నుంచి తొలగించాలని కోరారు. ఈ వీడియోలను పోస్టుల చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ కూడా కోరింది.

ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే పోలీసులు ఐదుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అస‌లు దోషుల‌ను పోలీసులు కాపాడుతున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు సికింద్రాబాద్ ప‌రిధిలో చోటుచేసుకున్న అత్యాచార ఘ‌ట‌న‌పైనా విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్టు మ‌హిళా క‌మిష‌న్ ప్ర‌క‌టించింది.