కశ్మీరీలు చైనా పాలన కోరుకుంటున్నారు.. మాజీ సీఎం ఫరూక్  - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీరీలు చైనా పాలన కోరుకుంటున్నారు.. మాజీ సీఎం ఫరూక్ 

September 24, 2020

National conference leader Farooq Abdullah: Kashmiris don't want to be Indian, would rather be ruled by Chinese

కశ్మీరీ ప్రజలపై మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వారు తమను భారతీయులుగా భావించుకోవడం లేదు. వాళ్లు పాకిస్తానీలు కూడా కాదు.. వాళ్లు భారత ప్రభుత్వాన్ని నమ్మడం లేదు’ అని అన్నారు. అంతేకాకుండా, కశ్మీరీలు చైనా పాలన కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. వారితో మాట్లాడితే వారిలోని చైనీయులు బయటపడతారని అన్నారు. 

 జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు. ‘మీరు కశ్మీర్‌ ప్రజలతో మాట్లాడితే వారు భారతీయులు భావించుకోవం లేదని తెలుస్తుంది. భారత్‌లో జీవించలేమనే ఆందోళన వారిలో కనిపిస్తుంది. వారు పాకిస్తానీలమని కూడా చెప్పారు. ప్రస్తుతం కశ్మీరీలు భారత ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరు. వాళ్లు గాంధీ భారత్‌లో విలీనమయ్యారుగాని మోదీ భారత్‌లో కాదు. మరోవైపు నుంచి చైనా ముందుకు దూసుకొస్తోంది. కశ్మీరీలతో మాట్లాడితో వారిలోని చైనీయులు బయటపడతారు.. చైనా తన ప్రాంతంలోని ముస్లింలకు ఏ గతి పట్టించిందో అందరికీ తెలిసిందే. నేను ఈ విషయంలో కచ్చితంగా ఉన్నాను. కశ్మీరీలు పాక్‌కు కూడా వెళ్లరు, అక్కడంతా కుళ్లిపోయింది.. ’ అని అన్నారు.