National flag..Heart of every Indian: Jagan
mictv telugu

జాతీయ జెండా..ప్రతి భారతీయుడి గుండె: జగన్

August 15, 2022

National flag..Heart of every Indian: Jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకలకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరై, జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి, శకటాల ప్రదర్శనను వీక్షించారు.

”స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా. పింగళి వెంకయ్య రూపొందించిన ఈ జాతీయ జెండా..ప్రతి భారతీయుడి గుండె. జాతీయ జెండా మన స్వాతంత్రానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక. వాదాలు వేరైనా దేశ స్వాతంత్రం గమ్యంగా పోరాడారు ఆనాటి యోధులు. వాళ్లను స్మరించుకుంటూ.. హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిన అవసరం ఉంది. అహింసే ఆయుధంగా, సత్యయే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం.. ప్రపంచ మానవాళికి మోహోన్నత చరిత్రగా నిలిచే ఉంటుంది.

ఈ 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించింది. ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోంది. రైతన్నలకు సెల్యూట్‌. ఆహారం, ఔషధాలు, ఆఖరికి స్మార్ట్‌ ఫోన్ల రంగంలోనూ దేశం టాప్‌ లిస్ట్‌లో కొనసాగుతోంది” అని ఆయన అన్నారు.