కాళేశ్వరం విస్తరణ గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేక్ - MicTv.in - Telugu News
mictv telugu

కాళేశ్వరం విస్తరణ గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేక్

October 20, 2020

National green tribunal break to kaleshwaram project

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నీళ్లు చల్లింది. కాళేశ్వరం పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ సంచలన తీర్పు ఇచ్చింది. సరైన పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టరాదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు విస్తరణ ప్రతిపాదనలును అందజేయాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. 

అపెక్స్ కౌన్సిల్ అనుమతిలేకుండా కొత్త ప్రాజెక్టులను చేపట్టవద్దని ఇప్పటికే కేంద్ర జల శక్తి శాఖ లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు విస్తరణకు పర్యావరణ అనుమతులు అవసరం లేదనడం సరైంది కాదని తెలిపింది. 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణానికి జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిటీ పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి పర్యవేక్షించాలని ఎన్జీటీ ఆదేశించింది. ప్రాజెక్టు విస్తరణపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని ఆదేశించింది.