National Green Tribunal imposed huge fine on Telangana Govt
mictv telugu

తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించిన ఎన్జీటీ

December 22, 2022

National Green Tribunal imposed huge fine on Telangana Govt

తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. అనుమతుల్లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపడుతోందని ఈ జరిమానా వేసింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5శాతం (సుమారు రూ.900 కోట్లు) జరిమానా విధిస్తూ ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పర్యావరణం సహ అనేక అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

దాఖలు చేసిన కేసులో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు తెలంగాణపై రూ.300 కోట్లు, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి రూ.528 కోట్లు, డిండి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి 92.8 కోట్ల భారీ జరిమానాలను విధించింది. ఈ జరిమానాలన్నీ మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్ద జమ చేయాలని పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది.