ఏపీలోని విశాఖ రుషికొండ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఆదేశించింది. దీంతో జగన్ సర్కారుకు గట్టి షాక్ తగిలినట్లయింది. ముఖ్యమంత్రి జగన్కు అక్కడ గెస్ట్ హౌస్ కట్టాలని.. సముద్రానికి ఆనుకొని ఉన్న రుషికొండపై కట్టడాలను పడగొట్టి కొండపై తవ్వకాలను చేపడుతున్నారు.
దీనిపై ఆ పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు.. రుషికొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, దీని వల్ల పర్యావరణానికి హానికలుగుతోందని గతంలో ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ పై పిటిషన్పై ఈ నెల 6న ఎన్జీటీ బెంచ్ విచారణ జరిపింది. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని ఎన్జీటీ నియమించింది. ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది.