ఫామ్‌హౌస్ కేసులో కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఫామ్‌హౌస్ కేసులో కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు

June 5, 2020

National green tribunal served notice to minister ktr

కొన్ని రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌజ్ అంశం వివాదాస్పదమైన సంగతి తెల్సిందే. జీవో 111ను ఉల్లంఘిస్తూ ఫామ్ హౌజ్ నిర్మించారంటూ కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని.. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారని రేవంత్ విమర్శించారు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో ఫిర్యాదు చేశారు. ఈ ఫామ్‌ హౌస్ ముట్టడి కేసులో పోలీసులు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన గ్రీన్ ట్రిబ్యునల్.. కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. మంత్రి కేటీఆర్‌తో పాటు, తెలంగాణ ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ), హెచ్ఎండిఏకు నోటీసులు ఇచ్చింది. అంతేగాక ఓ నిజనిర్ధారణ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో సెంట్రల్ ఎన్విరాన్మెంట్ రిజిస్ట్రీ రీజినల్ ఆఫీస్, తెలంగాణ పీసీబీ, జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, హెచ్ఎండీఎ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌లను సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.