జాతీయ స్థాయి స్విమ్మర్..టీ స్టాల్ పెట్టుకొని జీవనం - MicTv.in - Telugu News
mictv telugu

జాతీయ స్థాయి స్విమ్మర్..టీ స్టాల్ పెట్టుకొని జీవనం

November 20, 2019

National Level Swimmer Selling Tea In Bihar

ఒకప్పుడు జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఆయనకు సాటి ఎవరూ లేరు. పోటీకి దిగి ఎన్నో మెడల్స్ సాధించి బిహార్ రాష్ట్రానికి పేరు తీసుకువచ్చాడు. అంతటి ప్రతిభ ఉన్నా విధి మాత్రం కనికరించలేదు. కుటుంబ పోషణ కోసం రోడ్డు పక్కనే టీ స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. దాని పేరు కూడా ‘నేషనల్ స్విమ్మర్ టీ స్టాల్’ అని పెట్టుకొని గతాన్ని గుర్తు చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నాడు.

బిహార్‌కు చెందిన గోపాల్ మొదటిసారి 1987లో కోల్‌కత్తాలో జరిగిన జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అప్పట్లో విజయం సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత వరుసగా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు. కానీ అవేవి అతనికి అన్నం పెట్టలేదు. కనీసం స్పోర్ట్స్ కోటాలో అయినా ఉద్యోగం కోసం పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్వ్యూకు వెళితే అక్కడా నిరాశే ఎదురైంది.చివరకు కుటుంబ పోషణ బరువై పాట్నాలోని ఖాజీపూర్‌లో రోడ్డు పక్కన టీ స్టాల్ నడుపుతున్నాడు. అయితే తనకు క్రీడల పట్ల ఉన్న అభిమానాన్నిమాత్రం వదులుకోలేదు. చాలా మందికి స్విమ్మింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు.