మేడారానికి జాతీయ హోదా ఇవ్వండి...టీఆర్ఎస్ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

మేడారానికి జాతీయ హోదా ఇవ్వండి…టీఆర్ఎస్ ఎంపీ

February 4, 2020

n n

తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ..మేడారాన్ని అతిపెద్ద గిరిజన జాతరగా అభివర్ణించారు. తెలంగాణ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి గిరిజనులు మేడారానికి వస్తారని ఆయన సభలో చెప్పారు. సంప్రదాయ బద్ధంగా జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరుంది.

మేడారంకు హెలికాఫ్టర్ సర్వీస్

ఈ ఏడాది మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూరిజం ప్యాకేజీలో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం, మేడారం నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు వరకు సేవలు అందిస్తారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు చార్జి చేయనున్నారు. జీఎస్టీ అదనం. దీంతో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ వ్యూలో చూసేందుకు ప్రతి ప్రయాణికుడి వద్ద రూ.2999 నామ మాత్రపు చార్జీ వసూలు చేస్తున్నారు. భక్తులు హెలిక్యాప్టర్ సదుపాయంను ఉపయేగించుకోవటానికి ఫోన్ నెంబర్ 94003 99999కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.