డెంటిస్ట్రీ ఖరీదైనది కాదు.. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం మూల్యం చెల్లించకతప్పదు. మనం ప్రతిరోజూ చేసే అత్యంత ప్రయోజనకరమైన దినచర్య ఇది. నోటి పరిశుభ్రత ఆరోగ్యానికి మంచి చేస్తుంది.
బ్రష్ సరిగా చేయకపోతే దంతక్షయం, చిగుళ్ల వ్యాధికి దారితీస్తాయి. మనం చేసే చిన్న పొరపాట్లు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. గట్టిగా బ్రష్ చేయడం, ఎక్కువసేపు బ్రష్ చేయకపోవడం వంటివి మన పంటి నొప్పికి కారణమవుతాయి.
సరైన టూత్ బ్రష్..
చాలామంది మీడియం లేదా గట్టిగా ఉండే టూత్ బ్రష్స్ పండ్లను బాగా శుభ్రం చేస్తాయని నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. ఇలాంటి బ్రష్లు ఒకేసారి కాదు కానీ సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ దంతాల మీద ఉండే ఫలకం పోతుంది. అందుకే చిన్న తల ఉండి.. సాఫ్ట్ బ్రెజిల్స్ ఉన్న బ్రషెస్ పండ్ల మీద ఉన్న మురికి, ఇతరాలను సమూలంగా తీసేస్తాయి.
పేస్ట్ కూడా..
సెన్సిటివ్ టూత్ పేస్ట్ ని నిర్ణీత వ్యవధిలో మాత్రమే ఉపయోగించాలి. శాశ్వతంగా మాత్రం వాడకూడదు. టూత్ పేస్ట్ మీ దంతాలు, చిగుళ్లను రెండింటినీ రక్షించేలా చూసుకోండి. కాబట్టి మీ దంతాలు కుళ్లిపోకుండా కాపాడే ఫ్లోరైడ్ తో కూడిన పేస్ట్, జెల్ ఆధారిత భాగం చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనను నిరోధించడానికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్న పేస్ట్ ఎంచుకోండి.
త్వరగా.. చాలాసార్లు..
మీరు రోజుకు రెండు సార్లకంటే ఎక్కువ మీ దంతాలను బ్రష్ చేయకుండా చూసుకోండి. ఎక్కువగా బ్రష్ చేయడం వల్ల మీ చిగుళ్లు, ఎనామిల్ దెబ్బతింటాయి. ఫలకాన్ని తొలగించడానికి ఇది ఒత్తిడిని తీసుకోదు. అందుకే దంత వైద్యులు చాలా సమతుల్య ఒత్తిడిని ఉపయోగించి బ్రష్ చేయమని సూచిస్తున్నారు. రోజుకు రెండుసార్లు, ప్రతిసారీ 2-3నిమిషాలు బ్రష్ చేయడం సరైనదని అధ్యయనాలు చెబుతున్నాయి.
రెజ్లింగ్ వద్దు..
గట్టిగా బ్రష్ చేయడం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. ఎక్కువగా బ్రష్ చేయడం అంటే 3-4 సార్లకంటే ఎక్కువ బ్రష్ చేయడం హానికరం. సరిగా చేయలేమనిపిస్తే.. మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ బ్రష్ కి మారండి. బ్యాటరీ ఆపరేటెడ్ బ్రష్ ని ఉపయోగించడం ద్వారా ఆటోమేటిక్ గా మీ దంతాలు సురక్షితంగా ఉంటాయి.
ఒక్కసారి చాలు..
ప్రతీ దంతవైద్యుడు.. ఇతర వైద్య ప్రకటనల్లో రోజుకు రెండు సార్లు బ్రష్ చేయమని చెబుతారు. కానీ జనాభాలో చాలామంది రోజుకు ఒకసారి మాత్రమే బ్రష్ చేస్తారు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం వెనుక ఉన్న కారణమేమంటే.. దంతాల మీద బ్యాక్టీరియా ప్రభావాన్ని తొలగించడం. అయితే మీరు తిన్న ప్రతీసారి నోటిని శుభ్రంగా కడిగితే రోజుకు ఒక్కసారి బ్రష్ చేస్తే చాలంటున్నారు నిపుణులు.