National Unity Day on September 17: Telangana Cabinet Decision
mictv telugu

సెప్టెంబర్ 17పై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

September 3, 2022

తెలంగాణ నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారత దేశంలో కలిసిన సందర్భంగా సెప్టెంబర్ 17న జరిపే వేడుకలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున జాతీయ సమైక్యతా దినంగా పరిగణించాలని పేర్కొంది. ఈ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా జరపాలని ఆదేశించింది. అంతేకాక, ఈ నెల 16, 17, 18 తేదీల్లో జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో భాగంగా వజ్రోత్సవాలను కూడా నిర్వహించాలని నిర్ణయించింది.

శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రగతి భవన్‌లో సమావేశమైంది. దాదాపు మూడు గంటలకు పైగా జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. మిగతా విషయాలు ఇంకా తెలియరాలేదు. కాగా, బీజేపీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతుండగా, ఓవైసీ జాతీయ సమగ్రతా దినోత్సవంగా జరపాలని కోరారు. ఈ మేరకు కేసీఆర్, అమిత్ షాలకు లేఖలు రాశారు. అటు పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించే సభకు హోంమంత్రి అమిత్ షాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.