వివేక్.. ఐశ్వర్యపై ఆ ట్వీటేంటి? మహిళా కమిషన్ నోటీసు - MicTv.in - Telugu News
mictv telugu

వివేక్.. ఐశ్వర్యపై ఆ ట్వీటేంటి? మహిళా కమిషన్ నోటీసు

May 20, 2019

బాలీవుడు నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ చిక్కుల్లో పడ్డాడు. నటి ఐశ్వర్య రాయ్‌ జీవితాన్ని ఎగ్జిట్‌ పోల్స్‌తో పోల్చుతూ అతడు చేసిన ట్వీట్‌పై జాతీయ మహిళా కమిషన్ కన్నెర్రజేసింది. ఆ ట్వీట్ మహిళలను కించపరచేలా అనైతికంగా ఉందని, పురుషాహంకారానికి అద్దం పడుతోందని, చివరకు ఐశ్వర్య కూతురును కూడా వివాదంలోకి లాగారని ఆక్షేపిస్తూ నోటీసు జారీచేసింది. నోటీసు అందిన తర్వాత తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మమారాష్ర్ట మహిళా కమిషన్ కూడా మండిపడింది.

National women commission Issues Notice To Vivek Oberoi Over 'Disgusting' Election Meme on  Aishwarya Rai Bachchan’s past relationships with exit poll results.

కమిషన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా వివేక్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చాక వివేక్ ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో ఐష్‌- సల్మాన్‌, వివేక్‌, అభిషేక్‌లతో విడివిడిగా ఉన్నారు. సల్మాన్‌-ఐష్‌ ఫొటోపై ‘ఒపీనియన్‌ పోల్‌’ అని,  ఐష్‌-వివేక్‌ ఫొటోపై ‘ఎగ్జిట్‌ పోల్‌‌’ అని, ఐష్‌-అభిషేక్‌ ఉన్న ఫొటోపై ‘ఫలితాలు’ అని రాసుంది. ఇది మీడియాలో చక్కర్లు కొట్టడంతో వివేక్‌ సేర్ చేసుకుని ‘హ హ.. క్రియేటివ్‌.. ఇది రాజకీయం కాదు. కేవలం జీవితం’ కామెంట్ చేశాడు. ఐశ్వర్య గతంలో వివేక్, సల్మాన్‌లతో ప్రేమలో ఉన్నట్లు ప్రచార ఉంది. తర్వాత ఆమె అభిషేక్‌ను పెళ్లాడింది. ఎగ్జిట్ పోల్స్ వివాదంలోకి అనవసరంగా ఆమెను, ఆమె కుటుంబాన్ని లాగారని, ఇది పురుషాహంకారానికి నిదర్శనమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.