Home > జాతీయం > యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డ్ పోర్టబిలిటీ ఆప్షన్

యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డ్ పోర్టబిలిటీ ఆప్షన్

యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డ్ పోర్టబిలిటీ ఆప్షన్
X

మొబైల్ వినియోగదారులు తమకు నచ్చని నెట్వర్క్ నుంచి మరో టెలికాం ఆపరేటర్‌ కు మారే అవకాశం ఉంది. సర్వీసులు నచ్చకో.. లేదంటే ఇంతకంటే బెటర్ ఆఫర్స్ కోసమే పోర్టబుల్ ఆప్షన్‌ను ఎంచుకుంటారు. అయితే క్రెడిట్ కార్డుల వినియోగంలోనూ ఇదే స్ట్రేటజీ అమలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్లాన్ చేసింది. వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ మరియు ప్రీపెయిడ్ కార్డ్ నెట్వర్కులను మార్చుకునే సదుపాయాన్ని త్వరలోనే అమల్లోకి తేనుంది. అక్టోబర్‌ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్​బీఐ(RBI) సన్నాహాలు చేస్తోంది.





ప్రస్తుతం మన దేశంలో.. వీసా (Visa), మాస్టర్‌ కార్డ్‌ (MasterCard), రూపే (RuPay), అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ (American Express), డైనర్స్‌ క్లబ్‌ (Diners Club) వంటి సంస్థలు ఈ నెట్‌వర్క్‌ సేవలు అందిస్తున్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి ఈ సంస్థలు ఒప్పందం కుదుర్చుకుంటాయి. దీని ప్రకారం.. వినియోగదారుడికి ఏ కార్డు జారీ చేయాలన్నది ఈ సంస్థలే నిర్ణయిస్తాయి. కానీ.. ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రకారం.. తాను ఏ కార్డు పొందాలన్నది వినియోగదారుడి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.

దీంతో క్రెడిట్ కార్డు జారీ వేళలో కానీ లేదా తర్వాతైనా మరో నెట్వర్క్‌ కు మార్చుకునే అవకాశం ఇకపై వినియోగదారులకు లభించనుంది. ఈ ఆప్షన్ ద్వారా వినియోగదారుని ఇష్టాలకు విలువ ఇచ్చినట్లవుతుంది. ప్రస్తుత నెట్వర్క్ సేవలు నచ్చని పక్షంలో ఇతర వాటికి పోర్టబుల్ అయ్యే అవకాశం లభిస్తుంది. తద్వారా ఇ-కామర్స్ సంస్థలు సహా ఆయా కంపెనీలు ఇచ్చే పలు ఆఫర్లను ఈజీగా పొందే వెసులుబాటును యూజర్స్ పొందవచ్చు.




Updated : 19 Sep 2023 3:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top