LIC agents : ఎల్ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు కేంద్రం తీపివార్త..
X
వినాయక చవిత పండగ రోజు కేంద్రం ఎల్ఐసీ ఏజెంట్ల, ఉద్యోగుల నోట చక్కెర పోసింది. వారి గ్రాట్యుటీ పరిమితి పెంపుతోపాటు వారి సంక్షేమ కోసం పలు నిర్ణయాలు తీసుకుంది. 2017నాటి ఎల్ఐసీ ఏజెంట్ల రెగ్యులేషన్ సవరణ చట్టం ప్రకారం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర తెలిపింది. దేశవ్యాప్తంగా 13 లక్షల మందికిపైగా ఏజెంట్లు, లక్ష మందికిపైగా ఉద్యోగులకు ప్రయోజన చేకూరుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. తాజా నిర్ణయాల ప్రకారం.. ఎల్‌ఐసీ ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి 5 లక్షలకు పించారు. ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ. 10 వేల మధ్య ఉండగా ఇకపై రూ. 25 వేల నుంచి రూ. రూ.1.50 లక్షల మధ్య ఉంటుంది.
ఎల్ఐసీ ఉద్యోగులకు యూనిఫామ్ విధనానంలో 30 శాతం కుటుంబ పెన్షన్ అందుతుంది. ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. తిరిగి నియమితులైన ఏంజెట్లు కూడా రెన్యేవల్ కమిషన్లు పొందుతారు. ఎల్ఐసీ లాభాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఏజెంట్ల, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ. 9,544 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 1,88,749 కోట్లకు పెరిగింది.