Home > జాతీయం > చికెన్ షవర్మా తిని బాలిక మృతి.. ఎక్కడంటే..

చికెన్ షవర్మా తిని బాలిక మృతి.. ఎక్కడంటే..

చికెన్ షవర్మా తిని బాలిక మృతి.. ఎక్కడంటే..
X

చికెన్ షవర్మా తిని బాలిక మృతి చెందిన ఘటన తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి బయట రెస్టారెంట్ నుంచి తెచ్చిన చికెన్ షవర్మా తిన్న 14 ఏళ్ల బాలిక.. ఆ వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైంది. ఫుడ్ ఫాయిజన్ అయిందని గ్రహించిన తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది.

వివరాల్లోకి వెళ్తే.. బాలిక తండ్రి ఓ రెస్టారెంట్ నుంచి చికెన్ షావార్మాతో పాటు ఇతర నాన్ వెజ్ ఫుడ్ ని తీసుకువచ్చాడు. ఆదివారం రాత్రి బాలిక తన కుటుంబంతో కలిసి చికెన్ షావార్మా తింది. అదే రోజు రాత్రి ఫుడ్ ఫాయిజన్ కావడంతో బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఇంటికి తీసుకువచ్చిన కొద్ది సేపటికే బాలిక పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున మరణించింది.

అయితే ఇదే రెస్టారెంట్ లో మాంసాహారం తిని మరో 13 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు వెంటనే రెస్టారెంట్ పై దాడి చేసి , ఆహార నమూనాలను సేకరించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రిల్డ్ చికెన్, తందూరీ చికెన్, షావార్మా తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయినట్లు విచారణలో తేలింది. చికెన్ ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే దానిపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.




Updated : 19 Sep 2023 5:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top