మీరు ఏదైనా పనిచేస్తున్నప్పుడు త్వరగా అలసిపోవడం, మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండటం, తరచుగా కళ్లు చిమ్మచీకట్లుగా మారడటం, కళ్లతోపాటు గోర్లు పసుపు రంగులోకి మారటం, జుట్టు సాధారణం కంటే ఎక్కువగా ఊడిపోవడం ఇవన్నీ కూడా శరీరంలో రక్తం లేకపోవడానికి సంకేతాలు. శరీరంలో ఐరన్ లోపం వల్ల ఈ సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే…ఈ నివారణలను ప్రయత్నించండి.
1. రక్తహీనతకు ఎదుర్కొనేవారు బ్రేక్ ఫాస్టులో బీట్ రూట్ లో సగం నిమ్మరసం కలిపి తాగితే మంచిది.
2. ఎండు ఎండుద్రాక్ష, ఖర్జూరాలు ఐరన్‌కు మంచి మూలకాలు. రోజూ 4 ఎండుద్రాక్ష, 10 ఖర్జూరాలను బ్రేక్ ఫాస్టులో తినడం వల్ల రక్తహీనత నుండి ఉపశమనం లభిస్తుంది.
3. రక్తహీనతతో బాధపడేవారికి పాలకూర మంచి ఔషధం. రోజూ పాలకూరను తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ 20 శాతం వరకు పెరుగుతుంది.
4. రోజూ ఒక యాపిల్ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి తాగితే శరీరంలో రక్తహీనత రాదు. రోజూ ఒక యాపిల్ తినడం కూడా మేలు చేస్తుంది.
5. రోజూ ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడం మంచిది.
6. రోజూ కొన్ని మొలకెత్తిన సోయాబీన్స్ తినడం వల్ల, కొద్ది రోజుల్లోనే తేడా గమనించవచ్చు.
7. రక్తహీనత విషయంలో రోజూ 50 గ్రాముల బెల్లం తీసుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.
8. ప్రతిరోజూ అంజీర పండ్లను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో రక్తానికి లోటు ఉండదు.
9. మెంతి గింజల్లో ఐరన్ ఉంటుంది. కాబట్టి ప్రతి రాత్రి ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ మెంతి గింజలను నానబెట్టండి. ఉదయం వాటిని జల్లెడ పట్టి తాగండి.
10. రోజూ అల్పాహారంలో అరటిపండులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తింటే ఐరన్ లోపం ఉండదు.
11 . ఉదయం అల్పాహారంతో పాటు దానిమ్మ రసం తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది.
12. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల రక్తహీనత బాధించదు.
13 .ఒక కప్పు గోరువెచ్చని పాలలో కొద్దిగా బెల్లం కలిపి తాగితే శరీరంలో ఐరన్ లోపం ఉండదు.