నేచురల్ స్టార్ నాని…ఊరమాస్ గెటప్ లో అలరించబోతున్నాడు. దసరా తో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. నాని, కీర్తీ సురేశ్ రెండోసారి జంటగా నటిస్తున్న ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డెడ్స్ అందిస్తూ ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నా మూవీ మేకర్స్.
ఇప్పుడు లేటెస్టుగా ఈ మూవీ నుంచి మాస్ ట్రైలర్ రెడీ చేసినట్లుగా అప్ డేట్ ఇచ్చారు. దసరా ట్రైలర్ కోసం ఎంతో ఆతురతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ తాజాగా డేట్ ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు. మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఫ్యాన్స్ కు జాతర ప్రారంభం కానుందని నాని తాజా అప్ డేట్ అందించారు. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పదితలల రావణసురుడి భారీ విగ్రహానికి నిప్పంటుకోని విగ్రహం ఎదుట నాని నిల్చోని ఉంటారు. చేతిలో రెండు గొడ్డళ్లు పట్టుకుని ఉంటారు. పోస్టర్ చూస్తే గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
కాగా నానికి దసరా తొలి పాన్ ఇండియా మూవీ. దీంతో ప్రమోషన్స్ దగ్గరుండీ మరీ చూస్తున్నారు. హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.