nature of people who born in february
mictv telugu

ఈ నెలలో పుట్టిన వాళ్ళు మాంచి రొమాంటిక్ గా ఉంటారు.

February 3, 2023

nature of people who born in february

జనవరి వెళ్ళిపోయింది ఫిబ్రవరి వచ్చేసి మూడు రోజలు అయిపోయింది అప్పుడే. ఈ నెలలో ఉన్నది 28 రోజులూ అయినా ఈ మంత్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. తెలుగు వారికి పండుగలు ఉంటాయి. ప్రపంచానికి లవర్స్ డే ఉంటుంది. వరల్డ్ మొత్తం చేసుకునే వేలైంటెయిన్స్ డే ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. మరి అలాగే ఈ నెలలో చాలా మంది పుట్టిన రోజులు కూడా జరుపుకుంటారు.

అందరు మనుషులూ ఒక్కలా ఉండరు. వ్యక్తికీ వ్యక్తికి మధ్య బోలెడు తేడాలు ఉంటాయి. ఈ తేడాల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఏ నెలలో పుట్టారు అన్నదాన్ని బట్టి కూడా మనుషుల వ్యక్తిత్వాలు మారిపోతాయి అంటున్నారు జ్యోతిష్యాన్ని చెప్పేవారు, నమ్మేవారు. మనలో చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు. ప్రపంచంలో చాలా మందికి దీని మీద నమ్మకం ఉంటుంది. అయితే జాతకాలు మళ్ళీ రెండు రకాలుగా చెబుతారు. ఒకటి మనం పుట్టిన నక్షత్రం, తిధి ఆధారంగా, మరొకటి డేట్ ఆధారంగా. ఇప్పడు మంత్ ఆధారంగా కూడా మనుషుల వ్యక్తిత్వాలు చెప్పవచ్చును అంటున్నారు. దాన్నిబట్టి ప్రస్తుతం నడుస్తున్నది ఫిబ్రవరి నెల కాబట్టి, ఈనెలలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు ఎలా ఉంటాయో చూద్దాం.

హిందూ పంచాంగం ప్రకారం మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఏకాదశి తిథి నుంచి ఫిబ్రవరి నెల ప్రారంభమైంది.ఈ నెలలో జన్మించిన వారు అసాధారణమైన గ్రహణ శక్తిని కలిగి ఉంటారని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వంలో శక్తి, ఆకర్షణ కారణంగా వీరు చాలామందిని ఆకర్షిస్తారు. తమ మాటతీరుతో అందరినీ మెప్పిస్తారు. ప్రతి చిన్న పనిని శ్రద్ధగా పూర్తి చేస్తారు. నెమ్మదిగా ఎదగాలని కోరుకుంటారు. ఇతరులకు సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

వ్యక్తిత్వం:

ఈనెలలో పుట్టిన వారు రహస్య వ్యక్తులు. చాలా సందర్భాల్లో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.కానీ ఏ చిన్న బాధ కలిగినా మాత్రం దుఃఖంలో మునిగిపోతారు. వీరు అన్ని వయసుల వారితోనూ స్నేహం చేస్తారు. ఎవ్వరితో అయినా చాలా త్వరగా కలిసిపోతారు.వీళ్ళకు ఎంత ప్రతిభ ఉన్నా సామర్థ్యానికి తగ్గ ఆదాయం,పదవి రెండూ మాత్రం ఉండవట. అదృష్టం వీళ్ళకు కొంచెం దూరంగా ఉంటుంది.

ప్రేమ:

ఫిబ్రవరి నెల అసలే రొమాంటిక్ మంత్. అందుకే కాబోలు ఈ నెలలో పుట్టిన వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీళ్ళు పైపైన అందాల కన్నా అవతలి వారి మనస్తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అందరినీ బాగా నమ్మడం వలన ఎక్కువగా మోసపోతూ ఉంటారు.అలాగే వీళ్ళు ఎక్స్ట్రో వర్ట్స్ గా ఉంటారు. ఏ విషయాన్ని అయినా అందరికీ చెప్పేస్తుంటారు. అయితే ఎవరికైతే అసలు విషయాలు చెప్పాలనుకుంటారో వారి ముందు మాత్రం పూర్తిగా మౌనంగా ఉండిపోతారు. వీరు తమ భాగస్వామిని ఎంత లోతుగా ప్రేమిస్తారో.. వారి నుంచి మాత్రం తిరిగి అంతే ప్రేమను పొందలేరుట.

కెరీర్:

ఫిబ్రవరి నెలలో పుట్టిన వ్యక్తులు చాలా భావోద్వేగంగా ఉంటారు. ఈ కారణంగా వీరు కెరీర్లో అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వీరు చాలా త్వరగా విజయాలను సాధిస్తారు. తమ పని పట్ల చాలా నిజాయితీగా, క్లారిటీతో ఉంటారు. ఈ కారణంగా అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కానీ వ్యాపారంగంలో వీళ్ళకు అదృష్టం కలిసిరాదు. తమకు నచ్చిన పనిని మాత్రమే చేసేంత మొడిగా ఉంటారు. వీళ్ళకు ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్, పెయింటర్, టీచర్, రైటర్, కంప్యూటర్ లాంటి రంగాల్లో బాగా రాణిస్తారు. అంతేకాదు సంగీతం, డ్యాన్స్ లేదా సాహిత్యంలోనూ ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది.

లక్షణాలు:

ఫిబ్రవరిలో పుట్టిన పిల్లలు చాలా మొండిగా ఉంటారు.వీరి మొండి, తిరుగుబాటు ప్రవర్తన వల్ల వీరికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ఇతరులకు కొంతవరకు ఇబ్బంది కలగవచ్చును. మరోవైపు వీరికి సైన్స్ పట్ల ఆసక్తి ఉంటుంది. వీరు కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు. శాస్త్రవేత్తలు కావొచ్చు.