శెట్టి డ్యుయో సినిమా మొత్తానికి కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మిస్సెస్ శెట్టి మిస్టర్ శెట్టి మూవీ ఫైనల్లీ షూటింగ్ కు రెడీ అయింది. యువీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడో చేసినా ఇంతవరకూ పట్టాలెక్కలేదు.
అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ సినిమాలో ఒక షేఫ్ నటిస్తోందంటూ ఆమె పాత్ర పరిచయం చేశారు. తర్వాత సినిమా యూనిట్ నుంచి ఎలాంటి సందడి లేకపోవడంతో అసలు ఈ సినిమా తెరకెక్కుతుందా లేక నిలిపివేశారా అని అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. కానీ ఫైనల్ గా ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేశారు. వాస్తవానికి ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిన్ననే నవీన్ పోలిశెట్టి చేత ఒక కామెడీ వీడియో కూడా రిలీజ్ చేయించారు.
నవీన్, అనుష్క ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ చూడ్డానికి చాలా క్యూట్ గా ఉంది. ఇందులో అనుష్క శెట్టి విదేశాల్లో ఉన్నట్టు, నవీన్ పోలిశెట్టి మాత్రం హైదరాబాదులో ఉండి, వాళ్ళిద్దరి మధ్యా జరిగే ప్రేమ కథే సినిమాలా అనిపిస్తోంది. అనుష్క చేతిలో ఉన్న పుస్తకం మీద హ్యాపీ సింగిల్ అని ఉండగా నవీన్ పోలిశెట్టి షర్టు మీద మాత్రం రెడీ టు మింగిల్ అనే క్యాప్షన్ కనిపిస్తోంది. తెలుగు సహా తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు క్లారిటీ ఇచ్చారు.అంటే సింగిల్ గా ఉండిపోవాలని అనుకున్న ఒక వయసు మళ్ళిన అనుష్కను నవీన్ పోలిశెట్టి లాంటి కుర్రాడు వెంటపడితే ఎలాంటి ఫన్ జనరేట్ అవ్వబోతోంది.. అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు అనిపిస్తోంది.
నీరోషా సినిమా ఆటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.