కొవిడ్-19 కేంద్రంలో గాబ్రా డ్యాన్స్...వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

కొవిడ్-19 కేంద్రంలో గాబ్రా డ్యాన్స్…వీడియో వైరల్

October 20, 2020

nvnhm

దేశమంతా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున దుర్గామాత పూజలు చేస్తున్నారు. రోజు సాయంత్రం దుర్గ దేవి మండపాల్లో గాబ్రా నృత్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని గొరేగావ్‌లోని కొవిడ్-19 చికిత్స కేంద్రంలో డాక్టర్లు, రోగులు కలిసి గాబ్రా నృత్యం చేశారు. చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఉత్సాహపరిచేందుకు ఈ డ్యాన్స్ చేయించారు. 

కరోనా రోగుల్లో కొందరు మంచాల చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తుండగా మరికొందరు మంచాలపైనే కూర్చొని చూశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కొవిడ్ కేంద్రాల్లో కరోనా రోగులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా వారితో చెస్, క్యారం మొదలగు ఇండోర్ గేమ్స్ కూడా ఆడిస్తునారు. వైద్య సిబ్బంది కూడా డ్యాన్సు చేస్తూ కరోనా వైరస్ బాధితులను ఉత్సాహ పరుస్తున్నారు.