చొరబడిన చైనా నౌక..  తరిమికొట్టిన భారత నేవీ - MicTv.in - Telugu News
mictv telugu

చొరబడిన చైనా నౌక..  తరిమికొట్టిన భారత నేవీ

December 3, 2019

Navy 02

భారత సముద్ర జలాల్లో మరోసారి చైనా వేలు పెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా ఏవో అన్వేషణలు  సాగిస్తోంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఇవి జరుగుతుండగా భారత నేవి అధికారులు గుర్తించారు. వెంటనే తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో అక్కడి నుంచి చైనా నౌక తిరుగు ప్రయాణమైంది. రహస్యంగా సమాచారం సేకరించేందుకు చైనా ఆ నౌకను పంపించి ఉంటుందని భావిస్తున్నారు. 

చైనా రీసెర్చ్ నౌక ‘షి యాన్ 1’ పోర్ట్ బ్లెయిర్ సమీపంలోని అనుమానాస్పదంగా కనిపించింది. అక్కడ మన జలాంతర్భాగంలో పరిశోధనలు చేస్తున్నట్టు గుర్తించారు. అప్రమత్తమైన ఇండియన్ నేవీ చైనా అధికారులకు హెచ్చరికలు పంపడంతో అక్కడి నుంచి తిరుగు పయనమైంది. గూఢచర్యానికి పాల్పడి ఉండవచ్చని నేవీ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా చైనా తన సముద్ర భాగం నుంచి  ఇండియన్ నేవీకి చెందిన పి-81 మారిటైమ్ సర్వెయిలెన్స్ పరిశీలిస్తున్నట్టుగా ఇటీవల గుర్తించారు. ఎప్పటికప్పుడు చైనా కదలికలపై నిఘా ఉంచుతున్నట్టు నేవీ అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం విదేశీ జలభాగంలో పరిశోధనలు, అన్వేషణలు విరుద్దమని నేవీ అధికారులు వెల్లడించారు.