కలర్ కాదు బాస్ కంటెంటే ఇంపార్టెంట్ ! - MicTv.in - Telugu News
mictv telugu

కలర్ కాదు బాస్ కంటెంటే ఇంపార్టెంట్ !

July 20, 2017

నేను అందమైన నటీమణుల పక్కన నటించడానికి, నిలబడటానిక్కూడా అన్ ఫిట్ నని తెలియజేసినందుకు ధన్యవాదాలు అంటున్నాడు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. నాకింత వరకు ఈ విషయమే తెలియదు, నేను నటన మీద తప్ప నా పర్సనాలిటీ, అందం మీద అస్సలు దృష్ఠి పెట్టలేదని ట్విట్టర్లో ఆయన ఈ విధంగా స్పందించాడు. ‘ బహుమోషియా బందూక్ బాజ్ ’ అనే చిత్రం ట్రైలర్ లాంఛింగ్ సందర్భంగా ఆ కార్యక్రమంలో నవాజుద్దీన్ పాల్గొన్నాడు. ఆ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న సంజయ్ చౌహాన్ నవాజుద్దీన్ మీద పై విధంగా స్పందించాడు.

నటులంటే కొందరి దృష్ఠిలో ఆరడుగుల హైట్, మంచి హ్యాండ్ సమ్ పర్సనాలిటీ, సిక్స్ ప్యాక్ బాడీ.., ఇవేనా నటనకు కొలమానాలు ? హీరోయిన్ల విషయంలో స్లిమ్ పర్సనాలిటీతో, ఫెయిర్ కలర్ వున్నవాళ్ళే అర్హులా ? కానేకాదు.. అని నవాజుద్దీన్ సిద్దిఖీ లాంటి వాళ్ళు నిరూపించారు. నటన అనేది పర్ ఫెక్టుగా వుంటే ఇవన్నీ నత్తింగ్ అని నిరూపించినా చాలా మంది వాటినే కొలమానాలుగా భావిస్తున్నారు. బద్లాపూర్, హరామ్ ఖోర్, రమన్ రాఘవ్, బజిరంగీ భాయ్ జాన్, పాన్ సింగ్ తోమర్.., వంటి సినిమాలలో తన సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు నవాజుద్దీన్. తన నటనతో చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. నటుడికి నటన వస్తే వేరే ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదని తను ఎప్పుడో నిరూపించాడు.

కలర్ కాదు బాస్ కంటెంటే ఇంపార్టెంట్ .. అని నువ్వు ఇంతగా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నటనలో నువ్వు తోపువు, తురుమ్ వు. నిన్ను చూసి చాలా మంది గొప్ప నటులు అనుకుంటున్నవారు ఓనమాలు దిద్దుకోవాలేమో ? ఎందరో నటులు అవ్వాలనుకున్నవారికి నువ్వొక గైడ్ వి అన్న సంగతి వాళ్ళు వాళ్ళు తెల్సుకుంటే మంచిదేమో !?