నవాజుద్దీన్ తమ్ముడు నన్ను లైంగికంగా వేధించాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

నవాజుద్దీన్ తమ్ముడు నన్ను లైంగికంగా వేధించాడు..

June 3, 2020

Nawazuddin Siddiqui’s niece accuses his brother of sexual harassment

బాలీవూడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ కొత్త చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే తన భార్య ఆలియా ఇటీవల విడాకులు కోరిన సంగతి తెల్సిందే. తన భర్త, వారి కుటుంబ సభ్యుల వేధిస్తున్నారని ఆమె తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా ఈమెయిల్, వాట్సాప్ ద్వారా విడాకుల నోటీసులు పంపింది. ఈ వివాదం సద్దుమనుగక ముందే మరో వివాదంలో నవాజుద్దీన్ చిక్కుకున్నారు. నవాజుద్దీన్ తమ్ముడు వరుసకి కూతురు వరుస అయ్యే జమీనాని లైంగికంగా వేధించాడని వార్తలు వస్తున్నాయి.

జమీనా ఇటీవల ఢిల్లీ పోలీసులకి నవాజుద్దీన్ తమ్ముడిపై ఫిర్యాదు చేసింది. 9 ఏళ్ళ వయస్సులో చిన్నాన్న నన్ను లైంగికంగా వేధించాడు. అప్పుడు నాకు అవి అర్ధం కాలేదు. పెద్దయ్యాక అతడి గురించి తెలుసుకున్నాను. పెళ్లి తర్వాత కూడా వేధించాడు. అత్తింటి వారిపై కూడా తప్పులు కేసులు పెట్టి హింసించేవారు. ఈ విషయం పెద్దనాన్న(నవాజుద్దీన్‌)కి చెప్పగా..’అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు’ అన్నారని జమీనా ఆవేదన వ్యక్తం చేసింది. దీని గురించి నవాజ్ భార్య ఆలియా ట్విట్టర్ లో స్పందించారు. ఇది ఆరంభం మాత్రమే అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవాజుద్దీన్ కుటుంబంలో వస్తున్న వరుస వివాదాలు ఆయన అభిమానులను సైతం బాధిస్తున్నాయి.