నవాజుద్దీన్ భార్యకు అక్రమ సంబంధమని ప్రచారం..ఆమె స్పందన ఇదీ.. - MicTv.in - Telugu News
mictv telugu

నవాజుద్దీన్ భార్యకు అక్రమ సంబంధమని ప్రచారం..ఆమె స్పందన ఇదీ..

May 22, 2020

Nawazuddin Siddiqui’s wife Aaliya about rumors on her extramarital affair

బాలీవూడ్ టాలెంటెడ్ నటుల్లో ఒకరైన నవాజుద్ధీన్ సిద్ధిఖీ భార్య ఆలియా గత కొద్ది రోజులుగా వార్తలలో ప్రముఖంగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 2009లో నవాజ్-ఆలియాల పెళ్లి జరుగగా.. ఆమె ఇటీవల విడాకులు కోరింది. తన భర్త, వారి కుటుంబ సభ్యుల వేధిస్తున్నారని ఆమె తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా ఈమెయిల్, వాట్సాప్ ద్వారా విడాకుల నోటీసులు పంపింది.

ఇదిలా ఉంటే వయాకామ్‌ మీడియా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ పీయూష్‌ పాండేతో అలియా అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అందుకే నవాజ్ నుంచి విడాకులు కోరుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అలియా ట్విటర్ ద్వారా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. ‘నా గురించి వస్తోన్న తప్పుడు వార్తలని ఖండించుకనేందుకు నేను ట్విట్టర్‌లోకి వచ్చాను. నాకు ఎవరితో అక్రమ సంబంధం లేదు. నా ఫోటోని ఎడిట్ చేసి ప్రస్తుత పరిణామాలని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వేరే వ్యక్తులని కాపాడేందుకు నా వ్యక్తిత్వాన్నితప్పుపట్టడం చాలా తప్పు. నా కోసం, నా పిల్లల కోసం ధృఢంగా ఉండేందుకు సంసిద్ధంగా ఉన్నాను.’ అని ఆమె తెలిపారు.