Nayan, Vignesh Shivan's wedding video streaming rights bagged by an OTT giant backs out of the deal
mictv telugu

పెళ్లి వీడియో, ఫోటోలను 25 కోట్లకు అమ్ముకున్న నయన్.. బెడిసికొట్టింది..

July 18, 2022

సూపర్ స్టార్ న‌య‌న‌తార రీసెంట్‌గా ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ పెళ్లికి ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు, సినీ తార‌లు విచ్చేశారు. నెట్టింట న‌య‌న‌తార పెళ్లి విష‌యం తెగ వైర‌ల్ అయ్యింది. వీరి పెళ్లికి సంబంధించి కొన్ని ఫొటోలు మాత్ర‌మే బ‌య‌టకు వ‌చ్చాయి. వీడియోలు మాత్రం బయటకు వచ్చాయి. అందుకు కార‌ణం.. ఓ ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ న‌య‌న్‌, విఘ్నేష్‌ల పెళ్లికి సంబంధించిన ప్ర‌సార హ‌క్కుల‌ను భారీ మొత్తంలో చేజిక్కించుకుంది. అయితే ప్ర‌స్తుతం వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు స‌ద‌రు డిజిట‌ల్ సంస్థ ఇప్ప‌డు న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌ల‌కు షాక్ ఇచ్చింద‌ట‌. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే..

విఘ్నేష్ శివ‌న్ -న‌య‌న‌తార పెళ్లి ప్ర‌సార హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న త‌ర్వాత ఎక్కువ‌గా పెళ్లికి సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని నెట్‌ఫ్లిక్స్ కండీష‌న్ పెట్టింది. కానీ విఘ్నేశ్‌ పెళ్లి జరిగి నెల రోజులు గడిచిన సందర్భంగా విఘ్నేశ్‌ వరుసగా పలు పెళ్లి ఫొటోలను షేర్‌ చేశాడు. సౌత్‌, నార్త్‌ నుంచి పలువురు సినీ ప్రముఖలు పెళ్లికి హాజరై ఆశీర్వదించిన ఫొటోలను విక్కీ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇదే ఇప్పుడు స‌మ‌స్య‌గా మారింది. త‌మ కండీష‌న్‌ను క్రాస్ చేసి ఫొటోల‌ను విఘ్నేష్ శివ‌న్‌ నెట్టింట రిలీజ్ చేయ‌టంతో నెట్‌ఫ్లిక్స్ సీరియ‌స్ అయ్యింది.. డీల్ క్యాన్సిల్ చేసుకుంద‌నే వార్త‌లు నెట్టింట జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంతేకాదు తమ ఢీల్‌ను రద్దు చేసుకుని, అడ్వన్స్‌గా ఇచ్చిన డబ్బును వెనక్కి ఇచ్చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ నయన్‌, విఘ్నేశ్‌లకు డిమాండ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.