నయన్ - విఘ్నేష్ పెళ్లి ఆహ్వాన వీడియో.. సింపుల్‌గా అదిరిపోయింది - MicTv.in - Telugu News
mictv telugu

నయన్ – విఘ్నేష్ పెళ్లి ఆహ్వాన వీడియో.. సింపుల్‌గా అదిరిపోయింది

June 8, 2022

ప్రేమలో ఉన్నప్పటి నుంచి రూమర్లు వస్తున్న నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి ఎట్టకేలకు ఖరారయ్యింది. ఈ విషయాన్ని ఆ జంట అధికారికంగా ప్రకటించింది. అంతేకాక, తమ వివాహ ఆహ్వాన పత్రికను ఓ వీడియో రూపంలో రూపొందించి విడుదల చేశారు. అందులో వధూవరుల పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, వేదిక చిరునామా, వివాహ సమయం, అతిథులు ఏ డ్రెస్సులో రావాలి వంటి వివరాలు పొందుపరిచారు. జూన్ 9వ తేదీన తమిళనాడులోని మహా బలిపురంలో ఉదయం గం 8.30కు ముహూర్తంగా నిర్ణయించారు. తమిళ సాంప్రదాయ పద్ధతిలోనే ఈ వివాహం జరుగనుంది. కాగా, అతి కొద్ది మంది అతిథులు, బంధు మిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలోనే వివాహం జరుగబోతోంది. ఇప్పటికే వివాహ వేదిక వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెళ్లి తర్వాత భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, పెళ్లి తర్వాత నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. ఈ మేరకు నయన తార కాబోయే అత్త కండీషన్ పెట్టగా, నయన్ అందుకు ఒప్పుకుందని, అప్పటివరకు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తానని మాట ఇచ్చినట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.