ఆర్యసమాజ్‌లో నయనతార పెళ్లి  - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్యసమాజ్‌లో నయనతార పెళ్లి 

October 28, 2017

హీరోయిన్ నయతార, తమిళ దర్శకుడు విఘ్నేష్‌ను ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు  మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రెండు మూడు సంవత్సరాల నుండి  దర్శకుడు విఘ్నేష్‌తో నయతార ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

నయనతార , విఘ్నేష్‌తో ఉన్న కొన్ని ఫోటోలను  సోషల్ మీడియాలో తరచూ  పోస్ట్ చేస్తూనే ఉంది, అంతేకాదు ఇటీవల జరిగిన కొన్ని అవార్డు ఫంక్షన్లలో కూడా, వీళ్లిద్దరూ  జోడీగా కనిపించారు. మరి నిజంగా వీరిద్దరి  పెళ్లైపోయిందా, లేక  ఇవి పుకార్ల అన్న విషయం తెలియాల్సి ఉంది.