గురువారం ఆత్మీయులు, సినీ తారల మధ్య వైభవంగా వివాహం చేసుకున్న ప్రముఖ జంట నయనతార – విఘ్నేష్ శివన్ దంపతులు శుక్రవారం తిరుమలలో వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వివాహం తర్వాత మొదటి సారి రావడంతో అనంతరం అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో నయనతార వివాదంలో చిక్కుకున్నారు. దర్శనం అనంతరం మాడ వీధుల్లో ఆమె చెప్పులేసుకొని నడిచారు. ఆమె భర్త, మిగతా అందరూ చెప్పుల్లేకుండా నడిచారు. అయితే భర్త పక్కన ఉన్న మరో వ్యక్తి (బహుశా సెక్యూరిటీ అయి ఉంటాడు) కూడా చెప్పులేసుకుని ఉన్నాడు. ఈ వీడియో బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ మొదటి సారి కాదు కదా తిరుమలకు రావడం? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొకరు తిరుమల మాడ వీధులు అత్యంత పవిత్రమైనవి. ఇలా చెప్పులేసుకొని తిరిగినందుకు స్వామి వారిని క్షమాపణలు కోరమని హితవు పలుకుతున్నారు.
శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు అత్యంత పవిత్రమైనవి. మాడవీధుల్లో చెప్పులు వేసుకుని నడవడం నిషేదం. నయనతార గారు ఇలా చెప్పులు వేసుకుని తిరిగినందుకు స్వామి వారిని క్షమాపణ కోరండి. @VigneshShivN @NayantharaU pic.twitter.com/t531IE9SVs
— DONTHU RAMESH (@DonthuRamesh) June 10, 2022