Nayantara-Vignesh Sivan Honeymoon Photos Viral
mictv telugu

నయనతార-విఘ్నేష్ శివన్ హనీమూన్ ఫొటోలు వైరల్

June 21, 2022

Nayantara-Vignesh Sivan Honeymoon Photos Viral

దక్షిణాద్రి సినీ ప్రియులకు కోలీవుడ్ దర్శకుడు, లేడీ పవర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్‌ల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జూన్ 9 తేదీన మహాబలిపురంలో నయనతార-విఘ్నేష్‌లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌కు హ‌నీమూన్ కోసం వెళ్లారు. అయితే, వారుంటున్న హోట‌ల్ ఫొటోల‌ను విఘ్నేష్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఫోటోలను వీక్షిస్తున్న నెటిజన్స్ కొత్త జంట‌కు అభినంద‌నలు చెబుతున్నారు.

అయితే, ఈ హనీమూన్ కోసం విఘ్నేష్‌-న‌య‌న్ కోట్ల‌ల్లో ఖ‌ర్చు పెడుతున్నార‌ని స‌మాచారం. మొదటగా తిరుమలలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి అనంతరం తిరుమ‌లకు వెళ్లి అక్క‌డ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ క్రమంలో ఈ న్యూ క‌పుల్ వారి హ‌నీమూన్‌కు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.