నయనతార, విఘ్నేశ్‌‌ల పెళ్లి డేట్ ఫిక్స్‌! - MicTv.in - Telugu News
mictv telugu

నయనతార, విఘ్నేశ్‌‌ల పెళ్లి డేట్ ఫిక్స్‌!

May 7, 2022

దక్షిణాది సినీ ప్రియులకు హీరోయిన్ నయనతార అంటే తెలియని వారుండరు. మొదటిసారిగా మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ తెరకెక్కించిన ‘మనస్సినక్కరే’ అనే సినిమాతో నయనతార చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకూ టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ వంటి పరిశ్రమల్లో పలు సినిమాల్లో నటించి, ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో గతకొన్ని రోజలుగా నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు పెళ్లి గురించి అటు తమిళ పరిశ్రమలో ఇటు సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చ నడుస్తోంది. చాలా ఏడ్లుంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఎక్కడ చేసుకుంటారు? ఏ సంవత్సరం, ఏ రోజున చేసుకుంటారు? అనే పలు విషయాలపై అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు.

త్వరలోనే నయనతార, విఘ్నేశ్‌‌లు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి, పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్దమైయ్యారని, పెళ్లి డేట్‌, ప్లేస్‌‌ను ఫిక్స్‌ చేసుకున్నారని తెలుస్తోంది. జూన్‌ 9న, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో నయన్‌, విఘ్నేశ్‌ల వివాహం జరగబోతున్నుట్లు సమాచారం. పెళ్లి వేదికను బుక్‌ చేసుకునేందుకే నయన్‌, విఘ్నేశ్‌లు శనివారం తిరుమల వచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు. తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నయన్‌ కానీ, విఘ్నేశ్‌ కానీ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.