కాబోయే భర్తతో శ్రీవారి సేవలో నయనతార - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే భర్తతో శ్రీవారి సేవలో నయనతార

October 24, 2019

Nayantara  .

నాలుగేళ్ల క్రితం ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా ద్వారా నయనతార, విఘ్నేష్ శివన్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అప్పటినుంచి వీరి బంధం కొనసాగుతోంది. త్వరలోనే వీరిద్దరు ఒక్కటి అవుతున్నారనే వార్తలు వచ్చాయి. మొన్న ఆ సినిమా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విఘ్నేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో వారు అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ జంట ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీరితో పాటు డ్రమ్స్ శివమణిలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. 

ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని వీరు మ్రొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చి అభిమానులతో సెల్ఫీలు దిగారు.