Nayanthara and Vignesh Shivan pose with national flag as they celebrate Independence Day 2022 in Spain
mictv telugu

స్పెయిన్‌లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసిన కోలీవుడ్ జంట

August 16, 2022

స్పెయిన్ లోని బార్సిలోనా వీధుల్లో జాతీయ‌జెండాతో సంద‌డి చేశారు స్టార్ దంప‌తులు న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్. ఐదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న వీరు ఇటీవలే వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ జంట స్పెయిన్‌లో విహారయాత్ర చేస్తోంది. కాగా నయనతార తన భర్త విగ్నేష్‌ శివన్‌ తమ దేశభక్తిని చాటుకున్నారు.

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన దేశమంతా ఉత్సవాలతో మారుమోగిపోయింది. ఇంటింటికీ జాతీయ జెండా ఎగరవేసి మరీ.. ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు మన ప్రజలు. కాగా ఈ సమయానికి స్పెయిన్‌ టూర్‌లో ఉన్న ఈ జంట మాత్రం అక్కడ 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. స్పెయిన్ లో త్రివర్ణ పతాకంతో సందడి చేశారు. స్పెయిన్ లోని బార్సిలోనా వీధుల్లో నయన్‌, విగ్నేష్‌ మన జాతీయ జెండాను చెరో వైపూ పట్టుకొని వీధులన్నీ కలియతిరిగారు. అక్కడి వారికి మన దేశ గొప్పదనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జంట దేశభక్తిని చూసి వారి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.