దక్షిణాది సినీ ప్రియులకు ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను, లేడీ సూపర్‌స్టార్ నయనతార అంటే తెలియని వారుండరు. తాజాగా వీళ్లిద్దరూ వివాహం బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వివాహం జరిగిన రోజు నుంచి పలు దేవాలయాలను సందర్శించి, ఇటీవలే హానీమూన్ యాత్రను ముగించుకున్నారు.
ఈ క్రమంలో నయనతార, విఘ్నేష్ శివన్‌లకు సంబంధించిన మరో తాజా వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘నయనతార చెన్నైలోని పోయెస్‌గార్డెన్‌లో ఒకేసారి రెండు ఇళ్లను కొన్నదంట. చెన్నైలోని పోయెస్ గార్డెన్ అంటే సెలబ్రెటీలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్తారు. ప్రస్తుతం పోయెస్‌గార్డెన్‌లో రజనీకాంత్, జయచిత్ర, జయలలిత, శశికళ వంటివారి ఇళ్లు ఉన్నాయి. ఇప్పుడు నయనతార సైతం పోయెస్‌గార్డెన్‌లోనే నివాసం ఉండేందుకు సిద్ధమైందట.
అయితే, నయనతార కొనుగోలు చేసిన ఒక్కో ఇల్లు 8,000 చదరపు అడుగుల స్థలంలో ఉంటుందట. వీటిని బాలీవుడ్ స్టార్స్ ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్ చేసే ఓ ప్రముఖ సంస్థ రూ.25 కోట్లకు ఒప్పందం చేసుకుందట. ఒక్కో ఇంటిలో 1,500 చదరపు అడుగుల స్థలంలో స్విమ్మింగ్‌పూల్, నయనతార, విఘ్నేష్ శివన్ కోసం ప్రత్యేకంగా లిఫ్ట్, ఇతర పనివాళ్లకు మరో లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారట. సరికొత్తగా నిర్మించనున్న ఇళ్లలోకి నయనతార, విఘ్నేష్‌శివన్ జంట త్వరలోనే గృహ ప్రవేశం చేయనున్నట్లు నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.