సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా సంచలనమే చేసింది. షూటింగ్స్ కి మాత్రమే హాజరై.. ప్రమోషన్స్ కి దూరంగా ఉండే నయన్ దాదాపు పదేళ్ల తరువాత ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది కూడా మూవీ ప్రమోషన్స్ కోసం. పెళ్ళికి ముందు లవ్, బ్రేకప్, ఎఫైర్స్ వంటి వివాదాల్లో నానిన నయన్.. మూడుముళ్ల తరువాత సైతం సరోగసితో వార్తల్లో నిలిచింది. అయితే వ్యక్తిగత అంశాలే కాకుండా కెరీర్ పరంగాను ఈమె ఇరుకున్న అతిపెద్ద వివాదం మూవీ ప్రమోషన్స్ కి హాజరవ్వకపోవటమే. నయనతార కారణంగా చాలా మంది స్టార్ హీరోలు అవమానపాలయ్యారు కూడా. కోట్లకి కోట్లు పెట్టి సినిమాని తీస్తే.. ప్రేక్షకులకి సినిమాని రీచ్ చేసే ప్రమోషన్స్ వంటి కీలక ఘట్టాలకు చెప్పాపెట్టకుండా డుమ్మా కొట్టడం, కాల్స్ కి ఆన్సర్ ఇవ్వకపోవటం వంటివి చేసేది నయనతార. అయితే ఈ మోసంఫై తమిళ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వివాదం కూడా నడిచింది. ఒక దశలో నయనతారని నిర్మాతలు బ్యాన్ చేయాలనుకున్నారు కూడా. అప్పటి నుండి నయనతార ప్రమోషన్స్ కి రాలేను అని ముందే అగ్రిమెంట్స్ లో రాయించుకుని సినిమాలని చేయటం స్టార్ట్ చేసింది. ఈ కారణంగా పెద్ద హీరోలు ఈమెని దాదాపు పక్కనపెట్టేశారు. దాంతో లేడి ఓరియెంటెడ్ పాత్రలను చేస్తూ వచ్చింది నయనతార.
అయితే మొన్న మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో చిరంజీవి చెల్లిగా చేసింది నయనతార.. ఆఖరిసారిగా బాపుగారి శ్రీరామ రాజ్యం మూవీ ప్రమోషన్స్ కి హాజరైంది. బాలకృష్ణ వంటి స్టార్ హీరో చిత్ర ప్రమోషన్ కి హాజరైంది కాబట్టి మెగాస్టార్ మూవీ కోసం కూడా వస్తుంది అనుకున్నారంతా. గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాకి దెగ్గర కావటం.. చిరంజీవి స్వయంగా అడగటంతో ప్రమోషన్స్ కి వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చిందట నయనతార. సైరా అప్పుడు కూడా ఇలానే మోసం జరిగిందని అంటారు. అయితే ఈ వివాదంపై తాజాగా యాంకర్ సుమతో జరిగిన తన సొంత మూవీ ‘కనెక్ట్’ ఇంటర్వ్యూలో నోరు విప్పింది నయనతార. తాను నిర్మించిన సినిమాలకు ప్రమోషన్స్ చేస్తే విమర్శలు వస్తాయని ముందుగానే ఊహించిన నయనతార ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ప్రశ్నలు అడిగించుకుంది. ఇప్పటివరకు సినిమా ఇంటర్వ్యూస్ ఎందుకు చేయలేదని సుమ అడిగితే.. ‘మీరు బిజీ కదా, వేరేవారితో చేయటం ఇష్టం లేక సినిమా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు’ అంటూ వ్యతకారం చేసింది నయనతార. ఇక గాడ్ ఫాదర్ సక్సస్ మీట్ లోనూ ఎందుకు పాల్గొనలేదని అడిగితే తాను ఫారిన్ లో ఉన్నానంటూ కవరింగ్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తెలుగు.. తమిళ్.. మలయాళంలో ఎన్నో సినిమాలు చేసిందని.. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ టైంలో ఆమె ఇండియాలోనే ఉందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దీనిపై నయన్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే..!
ఇవి కూడా చదవండి :
పేరు మార్చుకున్న సందీప్ కిషన్.. ఆమెతో పెండ్లి కోసమేనా?
ఆస్కార్‌కు మరో అడుగు దూరంలో ‘ఆర్ఆర్ఆర్’.. షార్ట్‌లిస్ట్‌లో ‘నాటునాటు’ సాంగ్