Nayanthara Surrogacy Case Investigation Updates
mictv telugu

నయనతార సరోగసీ కేసులో ట్విస్ట్.. విచారణలో సంచలన నిజాలు

October 19, 2022

Nayanthara Surrogacy Case Investigation Updates

నయనతార జీవితం పెళ్లి తరువాత కూడా వివాదాస్పదమే అవుతుంది. ఎఫైర్స్, స్కాండిల్స్, బ్రేకప్స్ వంటి అంశాలతో వార్తల్లో నిలిచే ఈ సౌత్ క్వీన్ ఇప్పుడు సరోగసీ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టు వార్తలొస్తున్నాయి. నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ దంపతులు సరోగసి విధానంలో తల్లితండ్రులవ్వటం వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో సరొగసీని బ్యాన్ చేశారు. ఒకవేళ పిల్లల్ని కనలేని ప్రత్యేక పరిసితుల్లో సరోగసి కోసం ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకోవాలి. ఈ విధానానికి కొన్ని కీలక అంశాలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. భార్యా భర్తలు సరోగసీతో తల్లితండ్రులు అవ్వాలనుకుంటే.. కనీసం వారు 5 ఏళ్ళు కాపురం చేసి ఉండాలి. అంతే కాకుండా ఒక సంవత్సరం ముందే ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోవాలి. నయనతార దంపతులు సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మ నివ్వడం అనేది చట్ట బద్ధంగా జరిగిందా లేదా? అది నిబంధనలకు అనుగుణంగానే జరిగిందా? అనేవి పై ప్రశ్నలకి సాక్ష్యాలని చూపెట్టాల్సి ఉంటుంది. భవిష్యత్తులో విచారణకి హాజరుకాబోయే నయనతార దంపతులకి సైతం విచారణలో ఇవే ప్రశ్నలు ఎదురవుతాయి. అయితే ఇక్కడే నయనతార అడ్డంగా దొరికిపోనుంది అని తెలుస్తుంది.

విఘ్నేష్ – నయన్ దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే పిల్లలకు జన్మనిచ్చారు కాబట్టి.. సరోగసీ నిబంధనలు పాటించలేదని అర్థమవుతుంది. దాంతో సెలబ్రిటీ కపుల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అప్పుడే వీరిద్దరూ ఓ ట్విస్టు ఇచ్చారు. ఆరేళ్ల క్రితమే తాము పెళ్లి చేసుకున్నామని.. గతేడాది సరోగసీ కోసం తమ పేర్లను నమోదు చేయించుకొన్నామని నయనతార దంపతులు విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఎక్కడ కూడా పెళ్ళికి సంబందించిన తేదీని మాత్రం నయన్ దంపతులు ప్రభుత్వానికి చెప్పలేదట. సరోగసీ నిబంధనలకు భయపడే నయన్ దంపతులు పెళ్లి డేట్ ని చెప్పలేదని వార్తలొస్తున్నాయి. దాంతో తమిళనాడు ప్రభుత్వం నయనతార ఇష్యూపై మరింత లోతైన విచారణ చేయనుందట. ఎంక్వైరీలో నయన్ దంపతులు తమ పెళ్ళికి సంబంధించిన ఆధారాలు మరియు సరోగసి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధారాలు లేని పక్షంలో సరోగసీ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా త్రిసభ్య కమిటీ భావించే ప్రమాదం ఉంది.