లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. జూన్ 9న నయన్, విఘ్నేష్‌ల వివాహం జరిగినప్పటి నుంచి ఏదో ఒక అంశంలో ఈ జంట పేర్లు వినిపిస్తున్నారు. ఆ మధ్య సరోసగి వివాదంలో చిక్కుకొని బయటపడ్డారు. పెళ్లైన నాలగు నెలలకే సరోగసి ద్వారా కవలపిల్లకు జన్మనివ్వడం హాట్ టాపికైంది. ఇది చట్ట విరుద్ధమైన చర్య అంటూ పలువురు కేసులు కూడా పెట్టారు.
అయితే తాము 6 సంవత్సరాల కిందటే తమ వివాహాన్ని రిజిష్టర్ చేసుకున్నట్లు పత్రాలు సమర్పించి వివాదానికి ముగింపు పలికారు. తాజాగా మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. భర్త విఘ్నేశ్ శివన్ కోసం భార్య నయనతార సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇకపై అజిత్‌తో నటించనని నిర్ణయం తీసుకున్నట్లు ఆ వార్తలు సారాంశం. దీనికి కారణం తన భర్తను అవమానించడమేనట.
నయన్ భర్త విఘ్నేశ్ శివన్,అజిత్‌తో ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన కథను సిద్ధం చేసి ఆయనకు వినిపించారు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు కూడా లైకా ప్రొడక్షన్స్ ముందుకొచ్చింది. అయితే సినిమాకు సంబంధించి కథ నచ్చలేదంటూ అజిత్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్టు నుంచి విఘ్నేశ్ శివన్‌ను తప్పించారని సమాచారం.
దీనిపై నయన తార భర్త తరపున రంగంలోకి దిగిన నయన్.. అజిత్, లైకా ప్రొడెక్షన్స్‌తో సామరస్య పరిష్కారానికి ప్రయత్నించినా వారు ఒప్పుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆగ్రహానికి గురైన నయనతార ఇకపై అజిత్ సరసన నటించబోనని శపథం చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. గతంలో నయనతార, అజిత్ కలిసి నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. బిల్లా, ఆరంభం, విశ్వాసం వంటి చిత్రాల్లో వారు అభిమానులను అలరించారు.