లేడీ సూపర్ స్టార్ నయనతార దంపతులు ఇటీవల ఏదో రకంగా వార్తలో నిలుస్తున్నారు. నయన్-విఘ్నేష్ వివాహం తర్వాత నుంచి వారిపై సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ కొత్త జంట చేసిన ఓ మంచి పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డు పక్కన కారు ఆపిన నయన్ దంపతులు..కొత్త సంవత్సరం సందర్బంగా కొందరు మహిళలకు, పిల్లలకు గిఫ్టులు పంచిపెట్టారు. అడిగిన వారి అందరికి గిఫ్టులను అందించారు. స్వయంగా నయనతార దంపతులు వచ్చి తమకు బహుమతులు అందజేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. పలువురు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. నయన్-విఘ్నేష్ జంటను నెటిజన్లు అభినందిస్తున్నారు. పేదలకు సాయం చేసి మంచి పని చేశారని కామెంట్స్ చేస్తున్నారు. నయనతార నటించిన కనెక్ట్ చిత్రం ఇటీవల విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ అందాల తార షారుక్ ఖాన్ సరసన జవాన్ అనే చిత్రంలో నటిస్తోంది. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో విజయ్ పక్కన కూడా నటిస్తారని సమాచారం.
This makes her more beautiful #LadySuperStar #Nayanthara ❤️
Stay blessed ❤️ @VigneshShivNSuch a inspiring video pic.twitter.com/Cw6j9kVcDZ
— Aby Nayanthara (@NayantharaAby) January 4, 2023
ఇవి కూడా చదవండి :
థియేటర్లలో స్నాక్స్ రేట్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రెండో పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నటి ప్రగతి
కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు