లేడీ సూపర్ స్టార్ నయనతార, ఫిల్మ్ మేకర్ విజ్ఞేష్ శివన్‌లు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. సరోగసి ద్వారా పుట్టిన తమ కవల పిల్లలతో కలిసి మొదటిసారిగా మీడియా ముందు కనిపించారు ఈ లవ్ బర్డ్స్. ఫ్యామిలీ అవుటింగ్ కోసం వెళ్తున్న కపుల్‌ను చూసి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. ప్రస్తుతం నయనతార ఫ్యామిలీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నయనతార బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ జీన్స్ వేసుకుని ట్రెండీగా కనిపించింది. నయన్ కవల పిల్లలు బ్లాక్ అండ్ రెడ్ అవుట్ ఫిట్స్ వేసుకుని కెమెరాకు అందంగా కనిపించారు. 2022 జూన్ లో నయనతార, విజ్ఞేష్లు అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకకు షారుఖ్ ఖాన్, ఏఆర్ రెహ్మాన్, సూర్య, రజినీకాంత్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. రీసెంట్గా ఈ కపుల్ సరోగసి ద్వారా ఉయిర్, ఉలగమ్ అనే ఇద్దరు కవల పిల్లలను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించారు.