Nayanthara, Vignesh Shivan wedding: their first photo as a married couple
mictv telugu

వివాహ బంధంతో ఒక్కటైన విఘ్నేశ్ – నయన్

June 9, 2022

Nayanthara, Vignesh Shivan wedding: their first photo as a married couple

స్టార్‌ కపుల్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక గురువారం ఉదయం జరిగింది. మహాబలిపురంలోని షెరిటన్‌ హోటల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు కూడా మెరిశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో కార్తి, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దర్శకుడు అట్లీ, నిర్మాత బోనీకపూర్, మణిరత్నం కూడా హాజరై సందడి చేశారని తెలిసింది. సోషల్ మీడియాలో వీరి ఫొటోలు వైరల్ గా మారాయి. మరోవైపు తమ జీవితాల్లో ప్రత్యేకమైన ఈ రోజుని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందితోపాటు 1800 మంది చిన్నారులకు భోజనం అందజేయాలని ఈ జంట నిర్ణయించుకుందట. ఈ మేరకు అభిమాన బృందాలతో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.