Nayanthara was hospitalized after vomiting
mictv telugu

నయనతారకు వాంతులు.. విఘ్నేష్ నిర్వాకం వల్లే

August 10, 2022

ఇటీవలే పెళ్లి చేసుకొని ఆ వెంటనే హనీమూన్‌కి వెళ్లొచ్చిన సినీ జంట నయన్ – విఘ్నేష్‌ల పెళ్లి వీడియో ట్రైలర్‌ని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే పూర్తి పెళ్లి వీడియోను ప్రసారం చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి తర్వాత ఎవరి సినిమాల పనుల్లో వాళ్లు ఉండిపోయారు. నయనతార ముందుగా తాను కమిట్మెంట్ ఇచ్చిన చిత్రాలను పూర్తి చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో నయనతార కడుపునొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయిందనే వార్త గుప్పుమంది. ఇప్పుడేగా పెళ్లయింది అప్పుడే వాంతులా అని చాలా మంది ఆశ్యర్యపోతున్నారు.

నయనతార వాంతులు, కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిందనీ, వైద్యులు కొన్ని గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచి తర్వాత పంపించేశారని తెలిసింది. అయితే ఇదంతా ఆమె భర్త విఘ్నేష్ చేసిన నిర్వాక ఫలితమేనంట. విశేషమేమీ లేదుకానీ, విఘ్నేష్ వండిన ఓ వంటకాన్ని తిన్న నయనతారకు అది వరస్ట్‌గా ఉండడంతో వికారం, వాంతులు అయ్యాయంట. అందుకోసమే హాస్పిటల్‌కి వెళ్లిందని సమాచారం. మరోవైపు స్కిన్ అలర్జీ అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏది నిజమో వీరిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేగానీ రూమర్లకు ఫుల్ స్టాప్ పడదు. కాగా, నయనతార ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ చిత్రంలో నటిస్తోంది.